ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సంకష్టహర చతుర్థి గణపతి హోమం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ యాగశాలలో వైదిక కమిటీ ఆధ్వర్యంలో అర్చకస్వాములు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హోమ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. భక్తుల కష్టాలు తొలగి, సర్వకార్యాల్లో విజయం చేకూరాలని, లోకకల్యాణం సిద్ధించాలని, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.