మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?...
సూర్య బెజ్జుర్ :కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జుర్ మండలం మార్టిడి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు దిగేడా పోచక్క, బిబ్బేరు పోశం, ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూములు, ట్రాక్టర్లు ఉన్నవారికి, రాజకీయ పలుకుబడి కలిగినవారికి ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి, లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.