మైలవరం 5వ సెగ్మెంట్‌లో గొట్టం సుజాత విస్తృత ప్రచారం
మైలవరం, మేజర్ న్యూస్: మైలవరం 5వ సెగ్మెంట్ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం సుజాత గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తనతో పాటు ఇతర ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతున్నారు. అలుపెరగని ప్రచారంతో ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.