ఉయ్యూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి
ఉయ్యూరు, మేజర్ న్యూస్: మున్సిపాలిటీలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉయ్యూరు 20వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పట్టించుకోని పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు చేరువగా పాలన అందిస్తోందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపాలిటీలోనూ కూటమి బలపడాలని, 20వ వార్డు కూటమి అభ్యర్థి గోవిందరాజుల భవానిని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలని కోరారు. వైసీపీని తిరస్కరించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాయకులు రత్నం శివప్రసాద్ బుజ్జి, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, సయ్యద్ మతుల్లా, రాజులపాటి ఫణి, జంపన శ్రీనివాస్, గోవిందరాజుల వేణు, పువ్వాడ రాంబాబు, వెంట్రప్రగడ ఆంజనేయులు, బాపిరాజు, మూర్తి, గబ్బిట రమణ, లక్ష్మి, రషీద్, గఫార్, డాక్టర్ చిన్మయి, సీహెచ్. శ్యామల, గోవిందరాజుల భవాని, మాజేటి శ్రీనివాసరావుతో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.