రైతుల సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ నాయకుల డిమాండ్
రైతుల సమస్యలను పరిష్కరించాలి
– బీజేపీ నాయకుల డిమాండ్
*ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించిన నాయకులు
కందుకూరు: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు, ప్రకృతి విపత్తులు, విద్యుత్ సమస్యల కారణంగా ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు, మెదక్ జిల్లా ఇన్‌చార్జి బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు బస్వ పాపయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం
కందుకూరు మండల బీజేపీ అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన చలో ఆర్డీఓ కార్యాలయం కార్యక్రమంలో బొక్క నరసింహారెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పాల్గొని మాట్లాడారు. రైతులకు ఎకరాకు రూ.12 వేల రైతుబంధు సకాలంలో అందించాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, రూ.3 లక్షల రుణాలు, రైతు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే రైతుల పట్టా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం అధికారికి వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొక్క మాధవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తేరటి లక్ష్మణ్ ముదిరాజ్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పల్లె కృష్ణ గౌడ్, జిట్టా రాజేందర్ రెడ్డి, ఆనేగౌని అశోక్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, ఎగ్గిడి సత్తయ్య, నల్లబోలు నరసింహారెడ్డి, ఎడ్ల బాబురావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బక్క మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి గౌర ప్రభాకర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏంబటి రమేష్, బాలరాజ్ హరిబాబు,దార కుమార్, బొక్క సురేందర్ రెడ్డి,అచ్చన పాండు, మాసన్నగారి వెంకట్ రెడ్డి, బాలరాజ్, సోమరాజు వెంకటేష్ యువమోర్చా అధ్యక్షులు సామల దయాకర్ రెడ్డి, గిరిజన మోర్చా అధ్యక్షులు మోహన్ నాయక్, ఓబిసి మోర్చా అధ్యక్షులు అంబటి కృష్ణ, అంబటి యాదగిరి, బాలరాజ్,కళ్లెం సుధాకర్ రెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, కందడి శ్రీరాములు, నరసింహ, నవీన్, ప్రవీణ్,సత్యనారాయణ, బీజేపీ జిల్లా, మండల నాయకులు, కిసాన్ మోర్చా, యువమోర్చా, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్