BREAKING
ఎస్టీఐసీ-2026 సదస్సులో డీఆర్‌డీఓ అద్భుత ప్రదర్శన! ఖేత్ బచావో అభియాన్‌పై గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏవో సారిక అదనపు కమిషనర్ జక్కుల సువార్తకు ఘనంగా వీడ్కోలు రెండు ఎన్నికలకు విధులు కేటాయించిన సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇమ్యునాలజీ మందుల విక్రయాలతో లాభాల అంచనాలను పెంచిన కంపెనీ! రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ఆకట్టుకున్న ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవిశంకర్. రక్తదానం.. ప్రాణదానంతో సమానం - ఎస్సై మక్కువలో మిత్ర ధర్మాన్ని పాటించని కూటమి నేతలు కాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌కు సైబర్ షాక్ అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన పాత ముద్దాయిలకు బైండోవర్ బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనంతపురం 9వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఇంటింటా ప్రచారం’: కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కుంచపు నాగరత్నమ్మకు బ్రహ్మరథం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం అంతర్జాతీయ సముద్ర రవాణాకు భారీ గండం

అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు

Select Suryaa Now
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు
సూర్య కరీంనగర్ : భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎర్లీ ఇయర్స్ నుంచి 4వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం ప్రత్యేక దంత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. శ్రీ వెంకట దంత వైద్యశాల సహకారంతో ప్రముఖ దంత వైద్యులు డా. ఎల్. రాజా భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం జరిగింది. వైద్య బృందంలోని బి. వామన్ కుమార్, ఇతర నిపుణులు విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా దంత వైద్యులు పళ్లు తోముకునే సరైన పద్ధతులు, నోటి పరిశుభ్రత, దంతాల సంరక్షణ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయస్సులోనే దంత సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్ అనుదీప్ సౌగాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి తమ పాఠశాల నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.