BREAKING
అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన పాత ముద్దాయిలకు బైండోవర్ బాధిత రైతు కుటుంబాలకు భరోసాగా కేటీఆర్ పర్యటన - ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనంతపురం 9వ డివిజన్‌లో ముమ్మరంగా ‘ఇంటింటా ప్రచారం’: కూటమి కార్పొరేటర్ అభ్యర్థి కుంచపు నాగరత్నమ్మకు బ్రహ్మరథం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసిన రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఉత్తర నియోజకవర్గం 54వార్డులో జీవీఎంసీ ఎన్నికల ప్రచారం అంతర్జాతీయ సముద్ర రవాణాకు భారీ గండం జి.ఆర్.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు ముగింపు కార్యక్రమం ఎల్కపల్లి రైతు వేదికలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ రైలు కిందపడి యువకుడు మృతి 49 వ వార్డును ఉత్తమ వార్డుగా చేస్తాను.. వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే సైకిల్ కి ఓటేయాలి. 69వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా బీద మస్తాన్ రావు భారీ ర్యాలీ దక్షిణంలో వైసిపి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి విస్తృతంగా ప్రచారం ఏదులాపురం అభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఉచిత కంటి శిబిరంలో 55 మందికి కంటి పరీక్షలు....* *20 మందికి కంటి ఆపరేషన్లు....* జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి...

రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు - జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు

Select Suryaa Now
రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు - జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు
సూర్య నస్పూర్ : ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నస్పూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, వివిధ రెవెన్యూ అంశాలపై జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. జీఓ నంబర్లు 76, 59, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, భూ భారతి కింద పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, మీ సేవ ద్వారా జారీ చేయాల్సిన ధ్రువపత్రాల దరఖాస్తుల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భూ భారతి, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన ఫైళ్లతో పాటు మీ సేవ ద్వారా జారీ చేయాల్సిన పెండింగ్ ధ్రువపత్రాల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి సారించి రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సంతోష్, డిప్యూటీ తహసిల్దార్ హరిత, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.