BREAKING
ఉగాండాలో మూడు సంవత్సరాల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై చర్యలు - అదనపు కలెక్టర్ ఆర్.ఎస్ చిత్రు చేర్యాల సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు కెనడా ఆర్థిక వ్యవస్థ ఆగస్టులో స్తంభించిన వృద్ధి *ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్* భూభారతి రీ-సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం! సింగరేణి కార్మికుల హామీలపై సమాధానం చెప్పాలి - 12వ వేతన ఒప్పందంపై తేల్చకుంటే పోరుబాటే ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్! యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో వడ్డీ రేట్ల పెంపు చర్చ అశ్వారావుపేటలో డ్రంకెన్ డ్రైవ్‌లపై కొరడా..-ఇద్దరికి జైలు, ఇద్దరికి జరిమానా* ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ చైనా-యూరోపియన్ యూనియన్ సంబంధాలపై జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు సూర్య కథనానికి అధికారుల స్పందన అక్రమ నిర్మాణాల పనులు నిలిపివేయాలని ఆదేశం ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్‌పై అసత్య ప్రచారం ఆపాలి విబిజి రామ్‌జీ పనులు సమర్థవంతంగా చేపట్టాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీ ప్రారంభం

Select Suryaa Now
పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీ ప్రారంభం
సూర్య కరీంనగర్ : స్థానిక నగరంలోని పద్మనగర్‌, పారమిత హెరిటేజ్ పాఠశాలలో విద్యార్థుల కోసం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ అకాడమీని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ. ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యమిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు తెలిపారు.అలాగే షూటింగ్ క్రీడ వల్ల  విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం, మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం, ఒత్తిడిని అధిగమించడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను ఈ క్రీడ ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. పాఠశాల స్థాయిలోనే శిక్షణ పొందడం వల్ల విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధునిక క్రీడా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. తగిన శిక్షణ, నిరంతర సాధన, నిపుణుల మార్గదర్శకత్వంతో విద్యార్థులు షూటింగ్ క్రీడలో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ అకాడమీ ఉపయోగపడనుంది.ఈ షూటింగ్ అకాడమీ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ప్రతిభావంతులైన షూటర్లను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇ. ప్రసాదరావు, డైరెక్టర్ హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, షూటింగ్ రేంజ్ ఆఫీసర్ బొప్పు సత్యం, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.