అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
పెద్దపంజాణి,
తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులను ఓట్లతో ఆశీర్వదించాలని టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి జయరాం రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నేపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు రైతు పక్షపాతిగా మరియు మహిళలల అభివృద్ధి లో భాగంగా పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైందని ఇదే క్రమంలో స్థానిక సంస్థల్లో కూడా టిడిపికి ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రతి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో ప్రజల ఆదరణ చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.