దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.........జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి జిల్లా
దేశ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబందిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు డిసెంబర్ మాసంలో తిరుపతిలో నిర్వహించనున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది హాజరు కానున్న సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి చేపట్టవలసిన ఏర్పాట్లపై ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ రోడ్ సేఫ్టీ ఐజీ క్రాంతి రాణా టాటా, డిఐజీ (ట్రైనింగ్) విశాల్ గున్ని, జిల్లా ఎస్.పి.సుబ్బరాయుడు, ఇంటలిజెన్స్ అధికారి, తిరుపతి మున్సిపల్ కమీషనర్ జయకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు లతో కలసి సంబందిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని పాల్గొననున్న డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అధికారులు, అతిథుల వసతి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలు, హోటళ్లు, హోమ్‌స్టేల వివరాలను సేకరించి, రిజర్వేషన్ల ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైన మరమ్మతులు, పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్ నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, రహదారుల నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. తమకు కేటాయించిన బాధ్యతల మేరకు ముందస్తు కార్యాచరణ రూపొందించుకుని, క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా లోపాలు లేదా సమస్యలు గుర్తిస్తే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ & రోడ్ సేఫ్టీ ఐజీ మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటనకు దేశంలోని పలువురు ఉన్నతస్థాయి అధికారులు, ఐపీఎస్ అధికారులు, ప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వసతి, రవాణా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటనకు విచ్చేయనున్న అధికారులకు సంబంధించి జిల్లాలోని ప్రముఖ హోటల్స్, హోం స్టేస్ నందు వసతి ఏర్పాట్లు చేపట్టాలని అలాగే అదనపు వసతి కోసం కూడా హోటల్స్ నందు అదనపు గదులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నతాధికారుల కోసం హోటళ్లలో ప్రత్యేక డైనింగ్ ఏర్పాట్లు చేయాలని, వారి గోప్యతకు, సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పర్యటనకు సంబంధించి కండిషన్ కలిగిన వాహనాలు సమకూర్చాలన్నారు. ప్రతి వాహనాన్ని సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి ఫిట్‌నెస్, బ్రేకులు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. వాహనాల భద్రతా తనిఖీల విషయంలో రవాణా శాఖ, పోలీసు శాఖ, భద్రతా కమిటీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, యాంటీ సబోటేజ్ తనిఖీలు కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. హోటళ్ల వద్ద వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను గుర్తించాలని, రాత్రి వేళల్లో వాహనాల నిల్వకు తగిన ప్రదేశాలను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. పర్యటనకు వినియోగించే వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా అందేలా ప్రత్యేక పెట్రోల్ బంకులను గుర్తించాలని సూచించారు. విమానాశ్రయం నుంచి పర్యటన ప్రదేశాలకు అవసరమైన సామగ్రి తరలింపునకు ట్రక్కులను సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాఖకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించి, రోజువారీ పురోగతిని సమీక్షించాలని సూచించారు. ప్రధానమంత్రి పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఏర్పాటును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నర్సింహులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, శ్రీలత, రామకృష్ణ, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సుశీల దేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ రాజా నాయక్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ మధుసూదన్, ఐబీ అధికారి శిరీష, విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు, ఐసర్ జాయింట్ రిజిస్ట్రార్ కోహ్లీ, ఐఐటీ రిజిస్ట్రార్ కృష్ణకుమార్, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ అధికారి తిరులోగ్, డీఎస్పీలు, వివిధ శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.