దుత్తలూరులో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
దుత్తలూరు, మేజర్ న్యూస్ : దుత్తలూరు మండలంలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని వెంకటంపేట గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుత్తలూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డితో పాటు ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణతో పాటు మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.