డి.ఆర్.యు.సీ.సీ గా ఎం. వెంకటేశ్వరచారి...!
పగిడ్యాల మేజర్ న్యూస్ -: నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి సిఫారసుల మేరకు దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ యొక్క డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డి.ఆర్ .యు.సీ. సీ)లో సభ్యునిగా రెండు సంవత్సరాల కాలానికి, అనగా 01.09.2026 నుండి 31.08.2028 వరకు పనిచేయడానికి జనరల్ మేనేజర్/సౌత్ సెంట్రల్ రైల్వే నంద్యాల జిల్లా, నందికొట్కూరు పట్టణం సంగయ్య పేటకు చెందిన ఎం. వెంకటేశ్వరచారిని నామినేట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి వీరాభిమానిగా ఉంటున్న ఎం. వెంకటేశ్వరచారిని డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులుగా నియమించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కి, నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి కి వెంకటేశ్వరచారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.