BREAKING
ఏఐ దుర్వినియోగంపై నటి సునైనా ఆవేదన.. ఆన్‌లైన్ వేధింపులపై పోరాడాలని అభిమానులకు పిలుపు! ఐడీబీఐ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు .. తలసేమియా రోగులకు హైదరాబాద్ పోలీసుల రక్తదానం టెన్యూర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి.. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా కోటేశ్వరరావు కు MCCBA వినతి పత్రం. ఎన్నికల విధుల్లో సమన్వయంతో పనిచేయాలి: సీఐ వాసునాయుడు థియేటర్లలో ఆకట్టుకోలేక సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'! అమెరికాలో మోస్తరుగా పెరిగిన కార్మిక వ్యయాలు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం...... ఎన్నికల ప్రక్రియపై సమీక్ష హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం కెనడా ఆర్థిక వ్యవస్థకు భారీ షాక్ మోహన్‌లాల్ సన్నివేశాలు కట్ చేయడంపై మలయాళ ప్రేక్షకుల అసంతృప్తి.. బహిరంగంగా అంగీకరించిన 'జైలర్ 2' నిర్మాత! పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం కళా ప్రతిభకు వేదికగా ‘సాధన 2026’ సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళల్లో గీతం విద్యార్థుల ప్రతిభాప్రదర్శన కాంగ్రెస్ పార్టీలో యాదవులకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు.... యాదవ హక్కుల పోరాట సమితి.

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి సేవలు అభినందనీయం

Select Suryaa Now
మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి  సేవలు అభినందనీయం

చదువు విలువ తెలుసుకో... జీవితాన్ని మార్చుకో - మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్  ఏ ఎస్ ఎన్ రెడ్డి 
- దాతల సహకారంతో కేజీబీవీ విద్యార్థినిలకు మౌలిక  వసతులు కల్పించిన మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ 
- మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు,విద్యార్థినీ లు 
- మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సేవలకు సెల్యూట్ చేస్తున్న ప్రజలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: తల రాతలను సైతం మార్చి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టే ఏకైక ఆయుధం చదువేనని, చదువుల తెలుసుకొని ప్రభుత్వాలు, దాతలు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఇష్టంతో కష్టపడి చదువుతూ విద్యార్థినిలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సొంత నిధులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల ప్రారంభ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ శ్యామల ఆధ్వర్యంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని సంకల్పంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేర్పించారని, ఆడపిల్లల చదువు అభివృద్ధికి నాందిగా భావించి కష్టమైనప్పటికీ తమ బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు పాఠశాలలో చేర్పించారు అన్నారు. విద్యార్థినిలు హాస్టల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావడంతో దాతల సహకారంతో విద్యార్థినీలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. నందికొట్కూరు కు చెందిన బొలెరో, ఐచర్ వాహనాల యజమానుల సహకారంతో కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. 30 ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, 800 మీటర్ల మేర డ్రైనేజ్ కాలువ నిర్మాణం, నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు కొత్త సింటెక్స్ ట్యాంకులను, పైప్లైన్ కులాయి కనెక్షన్, 78 సింగిల్ మెటల్ ప్రేమలపై చెక్క పలకలు, కూర్చునేందుకు వీలుగా చెక్క బల్లలు, 18 బాత్రూమ్లకు డోర్లు, లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం కేజీబీవీ మునిసిపల్ శ్యామల, ఎం ఈ ఓ  2 అయూబ్ అహమ్మద్ లో మాట్లాడితూ ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీలను దృష్టిలో ఉంచుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ ఎస్ ఎన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మౌలిక వసతులు కల్పించినందుకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కేజీబీవీ పాఠశాలలో చదివే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినిలు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సరైన వసతులు ఉండాలని సంకల్పంతో ఏ ఎస్ ఎన్ రెడ్డి దాతలు సహకారంతో అభివృద్ధి పనులు చేయటం సంతోషంగా ఉందంటూ విద్యార్థినిలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఇష్టంతో కష్టపడి చదివి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆశయాలను నెరవేరుస్తారని అన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పేద విద్యార్థినిలకు అందించిన సేవను అభినందిస్తూ సెల్యూట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాతలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.