హరీష్ రావు చేతుల మీదుగా ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపు ప్రారంభం
హైదరాబాద్, ఖైరతాబాద్:ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర డివిజన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డోస్ స్పెషాలిటీ కాఫీ’ షాపును మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) పాల్గొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, విప్లవ్ కుమార్, రామచందర్, నరసింహ ముదిరాజ్, రావుల విజయ్ మూర్తుజ, యూసుఫ్ భాయ్ తదితరులు హాజరయ్యారు.