17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్:-నగరంలోని 17వ డివిజన్‌లో కూటమి (జనసేన) కార్పొరేటర్ అభ్యర్థి భవాని రవికుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు, కార్పొరేటర్ భవాని రవికుమార్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లక్ష్మీపతి, అంగడి చలపతి, శ్రీ వర్ధన్, సురేష్, కాయగూరల లక్ష్మీప్రసాద్, వెంకట్ నారాయణ, దరాజ్ భాష, మాధవ్, విజయ్, వీర మహిళలు అనసూయ, తిరుమల, గిరిజమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు మేదర వెంకటేష్, మల్లికార్జున, శివకుమార్, ఈశ్వర్, బాబురామాంజి, రఘు, పురుషోత్తం, మధు, నాగార్జున, సాయి, నవీన్, మంచాల చంద్ర, బీజేపీ నాయకుడు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..