BREAKING
నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్! రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి క్యూ2 తర్వాత 9 స్టాక్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రివ్యూ.. టార్గెట్లు ఇవే నా పేరిట ఉన్నవన్నీ ఫేక్ ఖాతాలే.. సోషల్ మీడియా ఐడీలపై విజయ్ తనయుడు జేసన్ సంజయ్ క్లారిటీ! ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ 17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి తుఫాన్ బాధితుల కన్నా రాజకీయాలు ముఖ్యమా..! * ప్రెస్ మీట్ లో మండలి విపక్ష నేత బొత్స * బాలీవుడ్ నటి అర్చన పూరన్ సింగ్ చిన్న కుమారుడి నిశ్చితార్థం.. ప్రేయసితో కొత్త ప్రయాణం!

జలదంకిలో జనసేనపై టీడీపీ నేతల చిన్నచూపా..?

Select Suryaa Now
జలదంకిలో జనసేనపై టీడీపీ నేతల చిన్నచూపా..?

జలదంకి, మేజర్ న్యూస్ :  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జలదంకి మండలంలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తూ తమ పార్టీకి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొందరు టీడీపీ సీనియర్ నాయకులు జనసేన ఉనికిని ప్రశ్నిస్తూ, చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో గుప్పుమంటున్నాయి.గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంలో జనసేన పార్టీ పాత్ర అత్యంత కీలకమని ఆ పార్టీ నాయకులు, వీరమహిళలు స్పష్టం చేస్తున్నారు. అదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని, సీట్ల కేటాయింపులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయి బలాబలాలు, గెలుపు గుర్రాల ఆధారంగానే సీట్లు కేటాయించాలనే ప్రతిపాదనను టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు రాష్ట్రస్థాయిలో కూటమి అగ్రనేతలు ఉమ్మడి అభ్యర్థుల జాబితా రూపకల్పనపై దృష్టి సారించిన నేపథ్యంలో, జలదంకి మండలంలో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల పంపకం ఆసక్తికరంగా మారింది. జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారు? టీడీపీ సీనియర్ల వైఖరితో ఉత్కంఠగా మారిన ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య సఖ్యత, సమన్వయం సాధ్యమవుతుందా? లేదా అనేది ఇప్పుడు నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.