BREAKING
నవల్గ అభివృద్ధికి రూ.57 లక్షలు.. 943 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 28వ వార్డు తేనెబండలో ఘన విజయమే లక్ష్యం - మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ - విజయాన్ని ఎమ్మెల్యే జగన్ మోహన్ కు కానుకగా అందిస్తాం - కార్పొరేటర్, తేజశ్రీ పచ్చప్ప నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి * ముగిసిన చివరి ప్రచారంలో బుడుమూరి * విశ్వక్ సేన్ 'కల్ట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? వృద్ధి పథంలో అంబుజా సిమెంట్స్: సిస్టమాటిక్స్ లక్ష్య ధర ఎంతంటే? జడ్పిటిసి గా అవకాశం ఇస్తే అన్ని విధాల అభివృద్ధి.. కూటమి జెడ్పిటిసి అభ్య ర్థి జబ్బల మీన.. గొట్టివలస ఎంపిటిసి అభ్యర్థి సంధ్య విస్తృత ప్రచారం ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ చివరి రోజు ప్రచారంలో షణ్ముగం మనవళ్ల జోరు - కార్పొరేటర్ చందు మేనల్లుళ్లుగా ప్రచారంలో సందడి - 52వ డివిజన్ లో సాయి సంతోష్, సాయి భార్గవ్ విస్తృత ప్రచారం - హేమలత గెలుపే లక్ష్యంగా ముందడుగు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రత్యేక క్యాంపెయిన్! రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి.. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్ దీపక్ తివారి క్యూ2 తర్వాత 9 స్టాక్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రివ్యూ.. టార్గెట్లు ఇవే నా పేరిట ఉన్నవన్నీ ఫేక్ ఖాతాలే.. సోషల్ మీడియా ఐడీలపై విజయ్ తనయుడు జేసన్ సంజయ్ క్లారిటీ! ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: సీఐ 17వ డివిజన్‌లో భవాని రవికుమార్ విస్తృత ప్రచారం.. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం

Select Suryaa Now
పంట నష్ట వివరాలను రైతులే నమోదు చేసుకునే అవకాశం

ఆమదాలవలస, సూర్య  : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులు తమ పంట నష్ట వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం పంట నష్టం వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు.రైతులు కర్షక్ .ఏపీ వెబ్‌సైట్‌ను సందర్శించి లేదా QR కోడ్‌ను స్కాన్ చేసి పంట నష్టం వివరాలను నమోదు చేసుకోవచ్చు. ముందుగా రైతు వివరాలు, ఆధార్ నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలి. అనంతరం సంబంధిత జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్, దెబ్బతిన్న పంట వివరాలు, నష్టపోయిన విస్తీర్ణాన్ని నమోదు చేసి, పంట నష్టానికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేయాలి.నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి సబ్‌మిట్ చేయాలని, నష్టం జరిగిన ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ పంట నష్ట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.