telangana
పోతేపల్లిలో పౌర హక్కుల దినోత్సవం
సూర్య, పెంచికల్‌పేట్: పౌరుల హక్కులపై అవగాహన కల్పించేందుకు పెంచికల్‌పేట్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దుర్గం పోషన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పౌర హక్కుల ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరూ తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్, పోలీస్ సిబ్బంది శ్యామ్, జీపీఆర్ఓ షారుఖ్, పంచాయతీ కార్యదర్శి చౌదరి రాకేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.