BREAKING
ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది - ఎంపీడీవో తాహీరా బేగం ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం! --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు.. --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు.. --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్

Select Suryaa Now
ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం!  --నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు..  --మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు..  --ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్

--ప్రారంభోత్సవం ఆర్భాటం... కొనుగోళ్లలో మాత్రం శూన్యం!

--నెల రోజులైనా పెసల కొనుగోళ్లు ప్రారంభించని అధికారులు..

--మార్క్‌ఫెడ్ కేంద్రం చుట్టూ రైతుల ప్రదక్షిణలు..

--ఉన్నతాధికారులు స్పందించాలని అన్నదాతల డిమాండ్

వైరా రూరల్ (సూర్య న్యూస్):- అక్టోబర్ 30:

ప్రారంభోత్సవం నాడు ఆర్భాటం.. ఆ తర్వాత అన్నదాతలకు అవస్థలు! రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే పెసల కొనుగోళ్లు ముందుకు సాగకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మార్క్‌ఫెడ్ పెసల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు కావస్తున్నా, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా కొనుగోళ్ల దిశగా పడకపోవడంపై రైతాంగం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.
పెసల పంట చేతికొచ్చి విక్రయించుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా, కొనుగోలు కేంద్రంలో మాత్రం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోజులు గడుస్తున్నా అధికారుల నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో కేంద్రం చుట్టూ తిరగడమే రైతులకు పనిగా మారింది. ఇదే విషయమై మార్క్‌ఫెడ్ అధికారులను రైతులు నిలదీయగా, వారం రోజుల క్రితం ఖమ్మం గోదాముకు పంపించిన పెసల లారీల్లో నాణ్యత లోపాలు ఉన్నాయనే కారణంతో అక్కడి అధికారులు వాటిని వెనక్కి పంపించారని చెప్పినట్లు రైతులు వెల్లడించారు.
అంతేకాకుండా, ఇప్పటికే ఖమ్మం గోదాముకు పంపించిన పెసలను అక్కడ దిగుమతి చేసుకుంటేనే వైరా కేంద్రంలో కొత్తగా కొనుగోళ్లు చేపడతామని, లేదంటే తాము ఏమీ చేయలేమని అధికారులు సమాధానమిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గోదాములో సమస్య ఉంటే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే తప్ప, ఆ సమస్యను సాకుగా చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు పంటను విక్రయించుకోలేక, మరోవైపు పెట్టుబడులు, అప్పుల భారం భరించలేక రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలోనే నెల రోజులుగా కొనుగోళ్లు జరగకపోవడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రారంభోత్సవానికి చూపిన చొరవ కొనుగోళ్ల నిర్వహణలో ఎందుకు కనిపించడం లేదని అన్నదాతలు నిలదీస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖమ్మం గోదాములో పెసల దిగుమతి సమస్యను పరిష్కరించడంతోపాటు వైరా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొనుగోలు కేంద్రం ప్రారంభించినా రైతులకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు మరింత బలపడే అవకాశం ఉంది.