BREAKING
31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం భారత్‌పై భారీ విజయంతో సిరీస్‌లో ఖాతా తెరిచిన కివీస్! స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి జగన్ కు బహుమతిగా అందించాలి హోమి జహంగీర్ భాభా భారతదేశ అణు ప్రస్థానానికి పటిష్టమైన పునాదులు వేసిన శాస్త్రవేత్త! అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తేజస్ విద్యార్థి

ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం

Select Suryaa Now
ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం

ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తున్నాం..

  • ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
  • రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, బిజెపి రాప్తాడు ఇంచార్జ్ చైతన్య కిషోర్

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :

ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం.. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాం.. భవిష్యత్ లో చేస్తూనే ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాప్తాడు నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ చైతన్య కిషోర్ అన్నారు. శుక్రవారం అనంతపురంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ  ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మేయర్, ఛైర్‌పర్సన్  జడ్పీటీసీ, ఎంపీటీసిలను గెలిపించాలని ప్రజలను వారు కోరారు. అభ్యర్థుల నాయకత్వ సామర్థ్యాలు, అభివృద్ధి దార్శనికతను వివరించడంతో పాటు ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరించారు. సూపర్ సిక్స్ హామీలు, మెగా డీఎస్సీ సహా ఇచ్చిన ప్రతి మాటను ఎన్డీయే ప్రభుత్వం నిలబెట్టుకుందని.. రాబోయే రోజుల్లోనూ నిరంతర సంక్షేమం, అభివృద్ధికి కూటమి పూర్తిగా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నిరంతర అభివృద్ధి, సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఎంతైనా అవసరమని ఓటర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ప్రజాసేవ పట్ల కూటమికి ఉన్న అంకితభావాన్ని వివరిస్తూనే, గత ప్రభుత్వ విధ్వంసకర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లామన్నారు. కూటమిలోని మూడు పార్టీల ద్వారా ప్రజాసేవ పట్ల అంకితభావం, నిజాయితీ ఉన్న యువ, విద్యావంతులైన అభ్యర్థులకు కల్పిస్తున్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అభివృద్ధిని వేగవంతం చేయడానికి, సంక్షేమ పథకాల పంపిణీని మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. ప్రస్తుతం ఎదురైన 'అర్నబ్' తుఫాను ముప్పును ఎదుర్కోవడంలో ప్రభుత్వం చూపిన ముందస్తు సన్నద్ధత, నిరంతర పర్యవేక్షణ మరోసారి స్పష్టంగా కనిపించిందన్నారు. జిల్లా యంత్రాంగాలతో సమన్వయం, మరియు సకాలంలో తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించారు. ప్రజల భద్రత, సహాయక చర్యలకే ప్రభుత్వం పెద్దపీట వేసిన తీరును తెలియజేశారు.  సమర్థవంతమైన స్థానిక పాలన, వేగవంతమైన అభివృద్ధి కోసం ఓటర్లందరూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు.