BREAKING
ధనాపురం, హోన్నంపల్లిలో టీడీపీ ప్రచార హోరు.. రాజగోపాల్‌కు మద్దతుగా జడ్పీటీసీ వెంకటేష్..... గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి మార్టిడిలో నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల లొల్లి?... జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం రైతులు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ లక్ష్మీశ దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లోకి దూసుకుపోతున్న కుందుర్పి జడ్పిటిసి వైఎస్ఆర్సిపి చైర్మన్ కూటమి నేతలు శిఖండి రాజకీయాలు మానుకోండి.. ఎర్రకోట బ్యాలెట్ ఓటింగ్ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ. రాజమహేంద్రవరం జీఎమ్‌సీలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం: ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షతన పక్షవాత నివారణ, ముందస్తు లక్షణాల గుర్తింపుపై సమగ్ర అవగాహన సదస్సు ఫోక్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి *వస్తున్న మీకోసం.. కార్యక్రమం*

బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డిమాండ్

Select Suryaa Now
బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు  డిమాండ్

సూర్య ..  బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బోయినపల్లి మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ… ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి, తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న బోయినపల్లి మండలాన్ని జాబితాలో చేర్చకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.బోయినపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలకు సరిపడా వర్షాలు కురవకపోవడంతో పంటల ఎదుగుదల దెబ్బతిని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోతోందని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చుల కోసం అప్పులు చేసి సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.కరువు మండలాల ప్రకటనలో రాజకీయాలకు తావివ్వకుండా, క్షేత్రస్థాయిలో వర్షపాతం, పంటల పరిస్థితి, సాగునీటి లభ్యత, పంట నష్టాలను సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి మండలాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని కోరారు.చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నప్పటికీ, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల రైతుల కరువు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని సూచించారు. రైతులు పంటలు వేయాలా వద్దా అనే ఆందోళనలో ఉండే పరిస్థితి రావడం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.రైతులకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదు. కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. బోయినపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు తక్షణ న్యాయం చేయాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని కత్తెరపాక కొండయ్య హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య సర్పంచులు అనుముల భాస్కర్ నిమ్మ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచుల పోరం రాష్ట్ర అధ్యధుకుడు అక్కనేపల్లి కర్ణాకర్ మాజీ సర్పంచులు చిందం రమేష్, రాజు,ముద్దం రవి. కవ్వంపెల్లీ రాములు కొంకటి శేఖర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, బోయినీ రాజు,నాగుల శ్రీనివాస్ గౌడ్ బుర్ర పూర్ణ చందు,బొజ్జ ప్రభాకర్ ,ఏడాపెల్లి తిరుపతి మల్లరపు చెందు,పెగ్గర్ల శేఖర్ , దూస మధు,గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.