ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు ఆర్ సి, సూర్య ; ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.గురువారం మణుగూరు మండలం చెరువు సింగారం గ్రామంలో ఈసం రజిత నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈసం రజిత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన గృహంలో వారి జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక కల అని,ఆ కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని తెలిపారు. సొంత ఇంటితో కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవం, స్థిరమైన జీవనానికి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం చేకూరేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
పొనగంటి కృష్ణ, మణుగూరు ఆర్ సి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా