కూటమి అభ్యర్థుల గెలుపుకై మాచాని ప్రచారం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి,ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ గురువారం పట్టణంలోని వీవర్స్ కాలనీ 20వ వార్డులో పర్యటించారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి బిజ్జే నాగరాజుతో కలిసి వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మాచాని సునీత, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బిజ్జే నాగరాజుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎమ్మిగనూరు చేనేత కుటుంబానికి చెందిన డాక్టర్ మాచాని సోమనాథ్ ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మమేకమై అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.