అక్రమ మొరం తరలింపును అడ్డుకున్నందుకు సర్పంచ్‌పై దాడి:మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రాళ్లగుడుపల్లి సర్పంచ్ వర్థ్య మహిపాల్
వికారాబాద్, మేజర్ న్యూస్: జిల్లాలోని మొమిన్‌పేట్ మండలం రాళ్లగుడుపల్లి గ్రామ సర్పంచ్ వర్థ్య మహిపాల్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గత కొంతకాలంగా అక్రమంగా మొరం (మట్టి) తరలిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో అక్రమంగా మొరం తరలింపును నిలిపివేసేందుకు వెళ్లిన తనను, మొరం తరలింపును ఎందుకు అడ్డుకుంటున్నావంటూ అదే గ్రామానికి చెందిన ఆశిరెడ్డి, లక్షయ్య దుర్భాషలాడారని, కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారని సర్పంచ్ వర్థ్య మహిపాల్ ఆరోపించారు.ఈ ఘటనపై ఆయన మొమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.