BREAKING
నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి టామ్‌కామ్‌ను టామ్ స్కామ్‌గా మార్చారు : ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన ఫీజులు తిరిగి చెల్లించాలి మార్టిడిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల లొల్లి? కళ్యాణదుర్గం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దుతాం. యస్వంత్ చౌదరి. 29వ వార్డులో కేడిమి సుమలత ప్రచార జోరు - మహిళల అండతో దూసుకెళ్తున్న టీడీపీ పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలి ఆలూరు గ్రామపంచాయతీ పాలకమండలి మీటింగ్ రద్దు స్ట్రోక్ చికిత్స‌లో ప్ర‌తి నిమిషం విలువైన‌ది... ఈవీఎం గో డాన్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అర్నబ్' తుఫాను నష్ట పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. తక్షణమే పంట నష్టం ఎన్యూమరేషన్, రైతులకు పారదర్శకంగా పరిహారం చెల్లింపు మైలవరం 5వ సెగ్మెంట్‌లో గొట్టం సుజాత విస్తృత ప్రచారం మైలవరం 4వ సెగ్మెంట్‌లో తోట నాగేశ్వరరావు విస్తృత ప్రచారం కొండపల్లి అభివృద్ధికి కృషి చేస్తా: కన్నెకంటి అమూల్య

దమ్ముంటే కోలగట్ల పై ఏ కేసులు ఉన్నాయో నిరూపించండి

Select Suryaa Now
దమ్ముంటే కోలగట్ల పై ఏ  కేసులు ఉన్నాయో నిరూపించండి

3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా

 సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారి పై దాని సూత్ర దారులపై చట్టపరమైన చర్యలు తప్పవు

మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి...

 విజయనగరం మేజర్ న్యూస్:  దమ్ముంటే కోలగట్ల పై ఏ క్రిమినల్ , చీటింగ్ కేసులు ఉన్నాయో నిరూపించాలని , 3 రోజుల్లో  నిరూపిస్తే  ఎన్నికల నుంచి తప్పుకుంటానని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సవాల్ విసిరారు. గురువారం సోషల్ మీడియాలో తనపై చేస్తున్న తప్పుడు ప్రచారం పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల తో మాట్లాడుతూ  మున్సిపల్ ఎన్నికల 3 రోజుల ముందు సోషల్ మీడియాలో  కేసులు అంటూ వైరల్ చేస్తున్నారనీ, మా మీద ఏ కేసులు లేవనీ అందుకే పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశానన్నారు.ఏవో ధర్నాలు చేసినపుడు  రాజకియా ల్లో కేసులు సహజ మన్నారు.ఎన్నికలప్పుడే కోలగట్ల మీద ఆరోపణలు వస్తాయనీ గతంలో స్వామి గెలిస్తే  రౌడీయిజం అని మొన్నటి ఎన్నికల్లో భూములు కబ్జా అంటూ ఆరోపించారన్నారు. రెండున్నర  ఏళ్ల పాటు  మీరు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.దమ్ముంటే కోలగట్ల మీద ఏ కేసు ఉందో నిరూపించండి 3 రోజుల్లో ఎన్నికల నుంచి పోటీ  తప్పుకుంటాన్ననారు.కోలగట్ల పై ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరనీ,  సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి పై, వారి వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.