జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం
జగ్గయ్యపేట 26వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం
సంక్షేమ పాలన తిరిగి రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి.
తన్నీరు సుధారాణి
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ : జగ్గయ్యపేట పట్టణంలోని 26వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సతీమణి తన్నీరు సుధారాణి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి షేక్ హఫీజున్నీసా , 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షాజీదా పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి మద్దతు కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు దూరమయ్యాయని విమర్శించారు. గతంలో ఇంటి వద్దకే అందిన పాలన తో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న సంక్షేమ సేవలు నేడు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజల జీవితాల్లో మళ్లీ సంక్షేమ వెలుగులు నిండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని కోరారు.
జగ్గయ్యపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 26వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షాజీదా కి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీమతి షేక్ హఫీజున్నీసా కి ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు వివరించారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా