BREAKING
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ వారణాసి తర్వాత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపైనే ఫోకస్? సీఐఐ సదస్సు ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ను వీక్షించిన మంత్రి లోకేష్

తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి – మేనేజర్ వరుణ్

Select Suryaa Now
తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి  – మేనేజర్ వరుణ్

సూర్య, తంగళ్ళపల్లి: తెలంగాణ గ్రామీణ బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తంగళ్లపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వరుణ్ కుమార్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ రుణాలు, ఎల్.టి రుణాలు, పాడి గేదెల కొనుగోలు కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు తక్కువ వడ్డీపై 25 లక్షల వరకు రుణాలు, అలాగే ట్రాక్టర్, హార్వెస్టర్, జేసీబీ వంటి వాటిపై రుణాలు ఇస్తున్నామన్నారు. రైతునేస్తం, వివిధ రకాల ప్రధాన మంత్రి ఇన్సూరెన్స్ పథకాల గురించి అవగాహన కల్పించారు.
రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా అత్యధిక వడ్డీ రేట్లు తమ బ్యాంకు ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  బ్యాంకు సిబ్బంది తిరుపల్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకుడు బొడ్డు పర్ష రాములు, సీఎస్పీలు, ఐకేపీ సిబ్బంది, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు.