APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
ప్రకాశం జిల్లాలోని APRS Santhanutalapad పాఠశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (APREIS) మరియు 'Forest by Heartfulness Foundation' వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘Net Zero Healthy Campus (NZHC) Initiative’ కింద "Certificate of Merit" (ప్రశంసా పత్రం) లభించింది. నెట్ జీరో క్లీన్ అప్ డ్రైవ్స్ (Net Zero Clean Up Drives) నిర్వహించడంలో మరియు పరిశుభ్రమైన, పచ్చని, ఆరోగ్యకరమైన క్యాంపస్‌ను రూపొందించడంలో మా పాఠశాల చూపిన నిబద్ధతకు ఈ ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన మన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులకు మరియు సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు.