BREAKING
పని దినాల్లోనే సర్పంచ్ ఎన్నికల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.. డి ఆర్ ఓ కు ఫ్యాప్టో జిల్లా నాయకుల వినతి మైనార్లు వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు : మదనపల్లి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా హెచ్చరికలు నవంబర్ 15న వెలుగులో మూర్ఛ వ్యాధి వైద్యశిబిరం : సంస్థ కార్యదర్శి యం.ఉదయ్ మోహన్ రెడ్డి వెల్లడి ఎంపీపీ ఎన్నికకు అధికారుల ఏర్పాట్లు పూర్తి! ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరికి ఆహ్వాన లేఖలు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన గౌతమ్ జూలకంటి *"చెయ్యెత్తండి - బస్సెక్కండి" నినాదం తుంగలో తొక్కిన ఆర్టీసీ!* *ఉచిత బస్సు పథకం అమలులో పిడుగురాళ్ల డిపో నిర్లక్ష్యం - ప్రయాణికుల అవస్థలు* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంటే, పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో మాత్రం ఆ పథకం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీస *షాద్‌నగర్‌లో రేపు పలు కాలనీల్లో 4 గంటలు విద్యుత్ సరఫరా నిలిపివేత... రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు! **16న నోటిఫికేషన్.. 18 నుంచి 20 వరకు నామినేషన్లు.. 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు** ఎన్టీఆర్ జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ నిత్యావసరాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు మాదకద్రవ్యాల నివారణకు యువత కృషి చేయాలి.. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ నగర సంకీర్తనకు ఆధ్యాత్మిక మేలుకొలుపు ఓటర్ స్లిప్ ఉన్నా, లేకపోయినా సరే, 20 రకాల గుర్తింపు కార్డుల్లో మాత్రం ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ హెచ్చరిక

Select Suryaa Now
రైతులను నిండా ముంచుతున్న కొనుగోలు కేంద్రాలు! కలెక్టరేట్ ముట్టడిస్తామని రసమయి బాలకిషన్  హెచ్చరిక

సూర్య - మానకొండూర్ :ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావుతో కలిసి ఆయన మానకొండూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తెచ్చి 25 నుంచి 30 రోజులు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫొటోలకు ఫోజులివ్వడానికి మాత్రమే స్థానిక ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెళ్లిపోయారని, ఆ తర్వాత కనీసం తిరిగి చూడలేదని ఆరోపించారు. నియోజకవర్గంలోని 146 గ్రామాల పరిధిలో ఏ కొనుగోలు కేంద్రం నుంచి ఏ మిల్లుకు ధాన్యం వెళ్లాలో ఇప్పటివరకు స్పష్టమైన కేటాయింపులు జరగలేదని, మిల్లుల అలాట్‌మెంట్ లేకుండా కేంద్రాలు ఎందుకు ప్రారంభించారని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడంతో రైతులు విసిగిపోయి, మార్కెట్ యార్డులోనే ప్రైవేట్ వ్యాపారులకు అడ్డికి పావుశేరు చొప్పున తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతు భరోసా, సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతుల నుంచే సెల్ఫ్ డిక్లరేషన్ అడగడం దారుణమని విమర్శించారు.అప్పులు చేసి పంటలు పండించిన రైతులు, కొనుగోళ్లు జరగక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందని, ఇప్పటికే గన్నేరువరంలో ఓ రైతు కల్లంలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలోగా మిల్లుల అలాట్‌మెంట్ పూర్తి చేసి, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని రసమయి బాలకిషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపెళ్లి శేఖర్ గౌడ్, వచ్చినూరు గ్రామ సర్పంచ్ పారునంది కేశవ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.