ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలి
లింగాల: ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26 వేలకు పెంచాలని, ఒకటో తారీకు నాడే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించాలని, పండగ జాతీయ ఆర్జిత 23 సెలవులను వేతనంతో కూడిన సెలవులు గా మంజూరు చేయాలని, ఒక నెల జీతాన్ని బోనస్ గా చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకై తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనల భాగంగా శుక్రవారం లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.ఈసందర్భంగా ఆసుపత్రి బ్రాంచ్ ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు జి.బాలరాజ్, కె ఈశ్వర్ లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి రోగుల మలమూత్రాలు ఎత్తిపోసి వెలకట్టాలని సేవలు అందిస్తున్నారని ప్రభుత్వమే ఒకపక్క గొప్పగా చెబుతున్నదని కానీ ఆసుపత్రుల పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతభత్యాల పెంపు పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. మూడు సంవత్సరాలకాల పరిమితితో ఏజెన్సీల విధానం అమలు జరుగుతుందని కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీల కాలపరిమితి ముగిసి రెండు సంవత్సరాల దగ్గరవుతున్న వాటిని రద్దు చేయకుండా పాత ఏజెన్సీ కాంట్రాక్టర్లకే అనుమతులు పొడిగించడం చేత కార్మికుల తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని శ్రమ దోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం జరగాలంటే నెలకు రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.చట్ట ప్రకారం పే స్కేల్, జాతీయ, ఆర్జిత సెలవులు అమలు చేయాలని,ప్రతి సంవత్సరం ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలి. ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫాం ఇవ్వాలని, ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇస్తున్న మొత్తం వేతనంపై ఈఎస్ఐ, పిఎఫ్ లు కార్మికుల ఖాతాలో సక్రమంగా జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆస్పత్రి కార్మికులు గద్ద బాలరాజ్,కాట్రాజ్ ఈశ్వర్, భీమన్న, ఎం.మల్లేష్, సందీప్, చంటి,మంజుల, మల్లమ్మ, రామేశ్వరమ్మ, నిర్మల, జ్యోతి, గీత,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.