ఘనంగా నాగుల చవితి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం మండలంలోని గ్రామాల్లో నాగుల చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామాల్లోని పంట పొలాల వద్ద ఉన్న పుట్టలకు రైతులు కుటుంబ సమేతంగా వెళ్లి నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టల వద్ద పాలు, పడగలు సిమిలి, చలివిడి, వివిధ రకాల పండ్లు, పూలను సమర్పించి పూజలు నిర్వహించారు ఆత్రేయపురం గ్రామంలోని వేంచేసియున్న సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏటుగట్టు వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు