BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!

Select Suryaa Now
ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!

 

​మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో 'సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్'పై నాలుగో అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు 'ఏఐ, సుస్థిరత, డిజిటల్ పరివర్తనతో వ్యాపార వ్యవస్థల పునర్నిర్వచనం' అనే థీమ్‌ను ఎంపిక చేశారు. ప్రారంభోత్సవానికి నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మరియు మిడ్-వెస్ట్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ధృబ కుమార్ గౌతమ్, ఐఐఎం తిరుచ్చి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ నిత్యానందం, ఆక్టోపి హెల్త్ సీఈఓ లోకేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఏఐ, సుస్థిర ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించారు.

​సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఏఐ ఆధారిత వ్యాపార రంగంలో ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, నైతిక నాయకత్వంపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యాపార సంస్థలు స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అవిరేని శ్రీనివాసులు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటింగ్ డీన్ ప్రొఫెసర్ దేవసేనాపతి, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ డీన్ డా. టి. మాధవి, కన్వీనర్ డాక్టర్ బి. ఉజ్వల, కో-కన్వీనర్లు డాక్టర్ ఎస్. కిషోర్, డాక్టర్ కె. వాణిశ్రీ, విద్యావేత్తలు, పరిశోధకులు, పారిశ్రామిక నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- చంద్రగిరి, మేజర్ న్యూస్