BREAKING
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ తొలిరోజే రూ.5,84,355 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు

సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
సిద్దిపేట కలెక్టరేట్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సిద్దిపేట, : సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలు అన్ని రంగాల్లో రాణించాలంటే చిన్ననాటి నుంచే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునే దిశగా కలలు కంటూ, వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు పౌరులని, దేశ సంపదగా ఎదగాలని ఆకాంక్షించారు. తమకు అందుబాటులో ఉన్న సేవలు, హక్కుల గురించి తెలుసుకొని, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి

ప్రతి బిడ్డకు రక్షణ, విద్య, ప్రేమ పొందే హక్కు ఉందని సౌజన్య స్పష్టం చేశారు. బాలల న్యాయ పరిరక్షణ చట్టం, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏ చిన్నారికి అన్యాయం జరిగినా 1098 బాలల సహాయవాణికి లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఫోన్ చేస్తే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాలు అందిస్తున్న సేవలను, బాలల పరిరక్షణ చర్యలను అభినందించారు.

మంచి అలవాట్లతోనే ఉజ్వల భవిష్యత్తు

జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, మంచి విద్యతో పాటు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మహిళా భద్రతా బృందాల ద్వారా బాలబాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న బాలల పరిరక్షణ సేవలను వివరించారు. గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీల పాత్ర, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, జిల్లా సంక్షేమ అధికారి శారద, బాలల సంక్షేమ సమితి సభ్యులు నరసింహులు, మంజుల, అంజమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, ఆశ్రిత స్వచ్ఛంద సేవా సంస్థ సమన్వయకర్త పర్వతాలు, బాలల పరిరక్షణ అధికారులు, వివిధ శిశు సంరక్షణ కేంద్రాల ప్రతినిధులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.