BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ తొలిరోజే రూ.5,84,355 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

Select Suryaa Now
సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్  తొలిరోజే రూ.5,84,355 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :     రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో రాష్ట్రంపై పారిశ్రామికవేత్తల విశ్వాసం పెరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. తొలిరోజే 73 ఎంఓయూలు, 15 జీవోల ద్వారా రూ.5,84,355 కోట్ల పెట్టుబడులు, 1,07,693 ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఒప్పందాలు జరగడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగని అన్నారు. రిలయన్స్ రూ.2.73 లక్షల కోట్లు, గ్రీన్‌కో రూ.45 వేల కోట్లు, పంచశీల్ రూ.37 వేల కోట్లు, ఏఎంఏఐ ఫ్యాక్టరీ రూ.31,387 కోట్లు, కియా రూ.18,878 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో 714 ప్రాజెక్టుల ద్వారా రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, 19.3 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడటం కూటమి ప్రభుత్వ కృషికి నిదర్శనమన్నారు. వీటిలో ఇప్పటికే రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరుకున్నాయని తెలిపారు. వేగం, స్థిరత్వం, సేవ అనే మూడు సూత్రాలతో ప్రభుత్వం పరిశ్రమలకు సహకారం అందిస్తోందన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో అనుమతులను వేగవంతం చేస్తూ, ఒప్పందాలను పరిశ్రమలుగా, పెట్టుబడులను యువతకు ఉద్యోగాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. భారీ పరిశ్రమల ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు, రవాణా, చిన్న వ్యాపారాలు, సేవా రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేస్తూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు.