భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు
గజ్వేల్ .. శుక్రవారం నాడు ఉదయం గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బస్సులు, కార్లలో కొట్టాల యాదగిరి గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు బయలుదేరారు. ముఖ్యంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీకి ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశార.