శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లో శనివారం విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని భట్టిప్రోలు సబ్స్టేషన్ ఎయ్యి నాగూర్ మీరా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 వ తేదీ శనివారం ఉదయం గం 08:00 ల నుండి మధ్యాహ్నం గం 02: 00 ల వరకు భట్టిప్రోలు సబ్ స్టేషన్ నందు గల 11కేవీ భట్టిప్రోలు ఫీడర్ పై మెయింటెన్స్ మరియు ట్రీ కటింగ్ పనుల కారణంగా భట్టిప్రోలు గ్రామ పరిధిలో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడుతుందన్నారు.కావున విద్యుత్ వినియోగదారులు పరిస్థితిని గమనించి సహకరించవలసిందిగా ఆయన కోరారు.