BREAKING
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత బాలల ఆరోగ్యానికి పోషకాహార తోటలు ఎంతో దోహదం బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం

ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు

Select Suryaa Now
ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :     ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి లభించిన విజయాలు ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించాయి. ఈ విజయాల స్ఫూర్తితో రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా కోవూరు మండలం మిక్కిలింపేటకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి   స్వయంగా పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. మిక్కిలింపేట మాజీ సర్పంచి కోడూరు చంద్రశేఖర్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు కోడూరు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ.. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరపాటి మస్తానయ్య, పోండ్ల మహేంద్ర, చిట్టేటి శివకుమార్, ధన్యాసి వంశీకృష్ణ, ధన్యాసి నరసయ్య తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.