BREAKING
రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం

Select Suryaa Now
బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలూ ముఖ్యం

మచిలీపట్నం, మేజర్ న్యూస్ : బాలల భవిష్యత్తుకు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని మచిలీపట్నం నగర మేయర్ అబ్దుల్ అబీదా అన్నారు. మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అబ్దుల్ అబీదా ముఖ్య అతిథిగా హాజరుకాగా,  16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు డాక్టర్ హసీం బేగ్, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ తేజస్వి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, ఆటపాటలతో కళకళలాడింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అబీదా మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో బాల్యం ఎంతో విలువైనదని, చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులు సైతం చిన్నారులతో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సరదా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఉత్సాహభరిత ప్రదర్శనలకు విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కార్యక్రమంలో నిర్మల హైస్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.