BREAKING
*రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి.. *ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* 30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ

సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం

Select Suryaa Now
సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం

కొండాపూర్;మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో హెచ్‌ఎండీఏ తుది అనుమతులు లేకుండానే ప్రైవేట్ వెంచర్లలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే అంశంపై సూర్య దినపత్రికలో ఇటీవల కథనం ప్రచురితమైంది. ప్రాథమిక అనుమతులతోనే ప్లాట్ల విక్రయాలు జరపడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడలు నిర్మించడం వంటి అక్రమాలను సూర్య వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనంపై స్పందించిన పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి, అనుమతులు లేకుండా నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేశారు. పలుమార్లు హెచ్చరికలు, నోటీసులు ఇచ్చినా నిబంధనలు పాటించకపోవడంతో ఈ చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంచర్ యజమానులు హెచ్‌ఎండీఏ తుది అనుమతులు పొందకుండా ప్లాట్ల విక్రయాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా, అక్రమంగా ప్లాట్లు విక్రయించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎంపీఓ యాదగిరి సెక్రటరీ బలరాం పాల్గొన్నారు సూర్య దినపత్రిక కథనానికి స్పందించి అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.