సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు!
హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో వెంచర్ల వ్యాపారం జోరుగా సాగుతున్నా.. ప్రజలకు కల్పించాల్సిన కనీస మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వెంచర్లు ఏర్పాటు చేస్తున్న యజమానులు ప్లాట్ల విక్రయాలపై చూపుతున్న శ్రద్ధ.. కొనుగోలుదారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు చూపడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల వంటి మౌలిక సదుపాయాలపై స్పష్టత లేకుండానే కొన్ని వెంచర్లు వెలుస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తున్న సామాన్య ప్రజలు తర్వాత కనీస వసతుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు విక్రయించే సమయంలో చూపించే హామీలు.. కొనుగోలు చేసిన తర్వాత అమలుకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమతులు ఇచ్చే ముందు పరిశీలన లేదా?
వెంచర్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలో నిబంధనలు, మౌలిక వసతుల ప్రణాళికలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారా? అనుమతులు పొందిన తర్వాత క్షేత్రస్థాయిలో వసతులు కల్పించారా లేదా అన్నది పర్యవేక్షిస్తున్నారా? నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం అనుమతులకే పరిమితం కాకుండా వెంచర్లలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనల అమలుపై స్పష్టత ఇవ్వాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అధికారులు స్పందించినా.. సమస్యకు శాశ్వత పరిష్కారం ఏది?
ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందించకుండా ముందస్తు పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వెంచర్ల యజమానులు నిబంధనల ప్రకారం మౌలిక వసతులు కల్పించేలా చర్యలు ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్లాట్ల విక్రయాల సమయంలో వ్యాపార లాభాలు లక్ష్యమా? కొనుగోలుదారుల భవిష్యత్తు కూడా బాధ్యత కాదా? హుస్నాబాద్ పట్టణంలో వెంచర్లపై సమగ్రతనిఖీలు ఎప్పుడు చేపడతారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల సొమ్ముకు భద్రత కల్పిస్తూ వెంచర్లలో కనీస మౌలిక సదుపాయాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇక వేస్ట్ చూద్దాం అక్రమ వెంచర్లపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా జూలిపిస్తారు లేక మౌనంగా ఉంటారు వేచి చూద్దాం.