మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
నెల్లూరు, మేజర్ న్యూస్ : మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర CEC సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ని అల్లూరులోని వారి నివాసంలో మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అందుబాటులో లేకపోవడంతో, నేడు వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షులు షేక్ షాహుల్, బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి కోడూరు మధుసూదన్ రెడ్డి వైసీపీ నాయకులు మోర్ల భరత్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.