ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కొండాపూర్;గోపులారం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ మండల పరిధిలోని గోపులారం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బొమ్మలు, స్వీట్లు పంపిణీ చేశారు. బాలలను చదువుల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, ఉపాధ్యాయురాలు పద్మ, అంగన్‌వాడీ టీచర్ అనసూయ, ఆయా నిరుప, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.