BREAKING
రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి ప్రస్తుత యువత మారుతున్నటెక్నాలజీ నికి అనుగుణంగా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి - జాయింట్ కలెక్టర్ నూరుల్ కుమార్ గోవా చలనచిత్రోత్సవంలో నివిన్ పౌలీ సర్వం మాయ అరుదైన ఘనత.. ఇండియన్ పనోరమ విభాగంలో ఎంపిక! పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించండి.. *ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా నిజం మాట్లాడితే బెదిరింపులా ఇదేనా మీ ప్రజాపాలనా సంస్కారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి* 30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!*

రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు

Select Suryaa Now
రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు

 

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండో విడతలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగ అనసూయ శుక్రవారం తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా, 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 22న అప్పీళ్ల స్వీకరణ, 23న అప్పీళ్ల పరిష్కారం, 24న నామినేషన్ల ఉపసంహరణతో పాటు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుందని వివరించారు. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.

**8 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ**

మండలంలోని గ్రామ పంచాయతీలను 8 క్లస్టర్లుగా విభజించి, ఆయా కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. కేంద్రాల వారీగా గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి.

1. **ఓర్వకల్లు:** ఓర్వకల్లు, కన్నమడకల, ఎన్.కొంతలపాడు, గుట్టపాడు.
2. **నన్నూరు:** నన్నూరు, మీదివేముల.
3. **పూడిచెర్ల:** పూడిచెర్ల, కేతవరం.
4. **లొద్దిపల్లె:** లొద్దిపల్లె, బొడ్డువానిపల్లె.
5. **ఉయ్యాలవాడ:** ఉప్పలపాడు, ఉయ్యాలవాడ.
6. **హుస్సేనాపురం:** హుస్సేనాపురం, కాల్వ, గుడుంబాయి తండా.
7. **శకునాల:** శకునాల, తిప్పాయపల్లి, బ్రాహ్మణపల్లి.
8. **సోమయాజులపల్లి:** సోమయాజులపల్లి, కొమరోలు, చింతలపల్లి, పాలకొలను.

అభ్యర్థులు తమ గ్రామ పంచాయతీకి కేటాయించిన కేంద్రంలోనే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో నాగ అనసూయ సూచించారు.