BREAKING
పిఎసిఎస్ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం జాతీయస్థాయి పోటీలో అక్షయ రాసిన కవితకు ఎంపిక సూర్య కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కుపాదం విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు...

ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!

Select Suryaa Now
ఏఐతో వ్యాపార విప్లవం.. సుస్థిరతతోనే భవిష్యత్తు!

 

​మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో 'సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్'పై నాలుగో అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు 'ఏఐ, సుస్థిరత, డిజిటల్ పరివర్తనతో వ్యాపార వ్యవస్థల పునర్నిర్వచనం' అనే థీమ్‌ను ఎంపిక చేశారు. ప్రారంభోత్సవానికి నేపాల్ త్రిభువన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మరియు మిడ్-వెస్ట్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ధృబ కుమార్ గౌతమ్, ఐఐఎం తిరుచ్చి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ నిత్యానందం, ఆక్టోపి హెల్త్ సీఈఓ లోకేష్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ఏఐ, సుస్థిర ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించారు.

​సదస్సులో భాగంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో ఏఐ ఆధారిత వ్యాపార రంగంలో ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, నైతిక నాయకత్వంపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వ్యాపార సంస్థలు స్వల్పకాలిక లాభాలకే పరిమితం కాకుండా సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అవిరేని శ్రీనివాసులు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటింగ్ డీన్ ప్రొఫెసర్ దేవసేనాపతి, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ డీన్ డా. టి. మాధవి, కన్వీనర్ డాక్టర్ బి. ఉజ్వల, కో-కన్వీనర్లు డాక్టర్ ఎస్. కిషోర్, డాక్టర్ కె. వాణిశ్రీ, విద్యావేత్తలు, పరిశోధకులు, పారిశ్రామిక నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- చంద్రగిరి, మేజర్ న్యూస్