BREAKING
30 మంది ప్రయాణికులు ఉంటే మీ వద్దకే ఆర్టీసీ బస్సు కేరళ అరికొంబన్ సంచలన బయోపిక్.. అధికారిక విడుదల తేదీ ఖరారు! *దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం

* జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు
రానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వోలు) తమకు కేటాయించిన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు సూచించారు.శుక్రవారం తిరుపతి నగరంలోని కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి, సూళ్లూరుపేట పరిధిలోని ఆర్వోలు, ఏఆర్వోలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవితో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశిత నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. శిక్షణలో వివరించే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని, ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలు, అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల ప్రక్రియలో పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, డి ఎల్ డి ఓ గంగాభవాని  సంబంధిత ఎన్నికల అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,