పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు...
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
నాగుల చవితి పండుగను పురస్కరించుకొని భక్తులు పాముల పుట్టలో పాలు పోస్తే శుభం జరుగుతుందని నమ్మకంతో భక్తులు పుట్టలో పాలు పోసేందుకు తండోపతండాలుగా క్యూ కట్టారు. దీనిని ఆసరాగా చేసుకున్న అవిలాల శివాలయం పక్కనున్న పుట్ట వద్ద స్థానికులు 50 రూపాయలు చెల్లించి రసీదు తీసుకుంటేనే పుట్టలో పాలు పోయాలని హుకుం జారీ చేశారు. శివాలయం వద్దనున్న పుట్ట వద్ద స్థానికులు చేస్తున్న దోపిడీని ప్రశ్నించిన భక్తులపై అక్కడున్న సిబ్బంది కేతరించుకున్న సంఘటనలు కూడా గురువారం నాగుల చవితిని పురస్కరించుకొని చోటు చేసుకున్న సంఘటన. వివరాలలోకి వెళితే అవిలాల శివాలయం వద్ద పాముల పుట్ట ఉంది. నాగుల చవితి పండుగను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకునేందుకు అక్కడికి వందలాది మంది వచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకున్న శివాలయం వద్దనున్న కొంతమంది స్థానికులు ఒక్కొక్కరి వద్ద నుండి 50 రూపాయలు రసీదు కడితేనే పుట్టలో పాలు పోసేందుకు అనుమతించారు. మామూలుగా లీటర్ పాలు 50 నుండి 60 రూపాయలు రేటు ఉన్నాయి. ఒకవేళ భక్తులు అర లీటర్ పాలు 30 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన నాగుల చవితికి పుట్టలో పాలు పోసేందుకు అక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న సిబ్బందికి 50 రూపాయలు చెల్లించాల్సిన దౌర్భాగ్యం పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నాగుల చవితి పండుగను ఆసరాగా చేసుకున్న స్థానికులు పుట్ట వద్ద పాలు పోసేందుకు 50 రూపాయలు వసూలు చేయడం పట్ల పంచాయతీలోని ప్రజలు భక్తులు అక్కడున్న సిబ్బంది తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రజలలో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని అక్కడున్నవారు ముక్కు పిండి 50 రూపాయల రసీదును ఇస్తున్నారు. ఆ రసీదులో ఎలాంటి చిరునామా కూడా లేదు. ఇలా వసూలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు భక్తుల నుండి వెలువడ్డాయి. చివరకు భక్తులు తమ వద్ద నుండి 50 రూపాయలు వసూలు చేసిన వారి పాప పుణ్యాలు దేవుడికే ఎరుక. అంతా శివయ్య చూసుకుంటాడని నిట్టూరుస్తూ భక్తులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.