బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ
డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజయవాడ వారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒంగోలు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి మార్కాపురం జిల్లా, మార్కాపురం టౌన్, మార్కాపురం మండలం మరియు ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామం & మండలంలోని బియ్యం మరియు నిత్యావసర వస్తువుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీలు నిర్వహించిన వ్యాపార సంస్థలు:
1. ఉదయభాస్కర్ రైస్ మిల్ ట్రేడర్స్, మద్దిపాడు గ్రామం & మండలం.
2. శ్రీనివాస ట్రేడర్స్ - బియ్యం వ్యాపారం, తర్లుపాడు రోడ్డు, మార్కాపురం పట్టణం.
3.కార్తికేయ ట్రేడర్స్ – హోల్‌సేల్ బియ్యం వ్యాపారం, పోలీస్ స్టేషన్ వెనుక, మార్కాపురం పట్టణం.
4.స్వాతి ట్రేడర్స్ - బియ్యం వ్యాపారం, పోలీస్ స్టేషన్ వెనుక, మార్కాపురం పట్టణం.
ఈ తనిఖీలలో అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులను విక్రయించడం, కొన్ని ఉత్పత్తులపై తప్పనిసరిగా ఉండవలసిన డిక్లరేషన్లు లేకపోవడం మరియు ఇతర నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యాపారులపై Legal Metrology Act-2009 & 2011 ప్రకారం మొత్తం 6 కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా వ్యాపారులకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించినట్లయితే సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా, నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం లేదా అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.
ఈ తనిఖీలలో పాల్గొన్న అధికారులు:
1. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.
2. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు.
3. పౌర సరఫరాల శాఖ అధికారులు.
4. కమర్షియల్ టాక్స్ అధికారులు.
5. అగ్రికల్చర్ మార్కెటింగ్ అధికారులు.