BREAKING
*దొంగతనం కేసుల ఛేదనలో పోలీసు అధికారుల ప్రతిభకు ఎస్పీ ప్రశంసలు!* పెంచలకోనలో వైభవంగా తిరుప్పావడ సేవ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ ఛట్ పూజ మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మాద్రి పృథ్వీరాజ్ *చింతలగట్టులో చలి సెగలు.. చలి మంటల చుట్టూ జనం!* పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి - మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో వైభవంగా రాహుకాల ఉద్యాపన, కార్తీక దీపోత్సవ పూజలు *చింతలగట్టులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* మదనపల్లి అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైకాపాకి లేదు : కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే ఖబర్దార్ : హెచ్చరించిన తెలుగుదేశం ముఖ్యనేతలు విద్యార్థి దశ నుండి గమ్యాన్ని ఎంచుకోవాలి.. సౌరవిద్యుత్‌లో ఏపీ ముందంజ.. భవిష్యత్తులో 50 శాతం పారిశ్రామికవేత్తలు మహిళలే సురక్షితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు నేటి దినపత్రిక సూర్య కథనానికి స్పందన శ్రీనివాసనగర్‌లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుర్గి మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

బాలలే దేశ సంపద

Select Suryaa Now
బాలలే దేశ సంపద

 

విద్య  ఆరోగ్యం  రక్షణ కల్పించడం ప్రాథమిక  బాధ్యత

సీనియర్ సివిల్ జడ్జి భారతి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్:  నగరం లోని స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాజీ ప్రధాని  జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ,రియల్ ఎన్‌జీఓ  రోప్స్ ఎన్‌జీఓ  సామాజిక సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నేడు సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ  సీనియర్ సివిల్ జడ్జి  భారతి హాజరై, పిల్లలకు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు విద్య, ఆరోగ్యం, రక్షణ ఎంత ముఖ్యమో వివరించారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం వంటి దురాచారాలను నిర్మూలించాలని, ప్రతి బిడ్డను పాఠశాలకు పంపాలని సూచించారు. ఆడ పిల్లలు చదువు కొని స్వతంత్రంగా నిలబడాలని, లక్ష్యాలు పెట్టుకొని కష్టపడి చదవాలని ప్రోత్సహించారు. జిల్లా న్యాయ సేవల అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని, అవసరమైతే 181, 100  చైల్డ్ హెల్ప్ లైన్ 1098  నంబర్‌కు సంప్రదించాలని తెలియజేశారు.పిల్లలు దేశ భవిష్యత్తు అని నొక్కి చెప్పిన అతిథులు, వారికి మంచి విద్య, పోషకాహారం, సురక్షితవాతావరణం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి బాలుడికి, బాలికకు సమాన అవకాశాలు కల్పిస్తూ, బాల్యాన్ని ఆనందంగా, భద్రంగా గడిపే హక్కును పరిరక్షించాలని, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు  ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలుతెలియజేశారు. ఆరోగ్య వంతులుగా, సురక్షితమైన వాతావరణంలో ఎదిగి భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని  ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమం నందు డీ సీ పి యు , సి హెచ్ ఎల్  సిబ్బంది పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.