BREAKING
విద్యార్థుల బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌ : ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి డిమాండ్ వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరమార్శించిన ఎమ్మెల్యే అమిలినేని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి అరుదైన గౌరవం సౌకర్యాలు లేకుండానే వెలుస్తున్న వెంచర్లు! ప్రజల జేబులకు చిల్లు.. అధికారుల పర్యవేక్షణ ఏది? నిబంధనలు గాలికి.. కొనుగోలుదారులకు కష్టాలు! మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. రెండో విడతలో ఓర్వకల్లు మండల పంచాయతీ ఎన్నికలు శనివారం భట్టిప్రోలు గ్రామంలో విద్యుత్ కు అంతరాయం భారత మార్కెట్లోకి బీవైడీ లగ్జరీ బ్రాండ్ 'డెంజా' ఎంట్రీ భారీగా తరలివెళ్లిన గజ్వేల్ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమ్మ నాయకత్వమే నమ్మకం.. టీడీపీలోకి మిక్కిలింపేట వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ తరగతులు ప్రారంభం పాముల పుట్టలో పాలు పోయాలంటే.... రూ. 50 ఇవ్వాల్సిందే... పోటెత్తిన భక్తులు... అవిలాలలో భక్తుల నుండి ముక్కు పిండి వసూలు చేసిన నిర్వాహకులు... ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలలో మార్పులపై కసరత్తు బాలలే దేశ సంపద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న నిర్ణయం

సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం

Select Suryaa Now
సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సమాయత్తం

సూర్య స్టేట్ బ్యూరో.

గిద్దలూరు: రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామ పంచాయతీలో స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, అభ్యర్థుల ప్రజాదరణను పరిగణనలోకి తీసుకొని సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎన్నికల కార్యాచరణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఆరు మండలాల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి, నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.