ఢిల్లీలో కాలుష్యా నిరోధక ఆంక్షల అమలుపై ఇంటర్‌స్టేట్ పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష
సూర్య జాతీయ డెస్క్: జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు మరియు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పొరుగు రాష్ట్రాల అధికారులతో కీలక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. నార్తర్న్ రేంజ్ ట్రాఫిక్ డిసిపి సచిన్ కుమార్ సింఘాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర సరిహద్దు ప్రాంతాల సీనియర్ ట్రాఫిక్ పోలీసులు హాజరయ్యారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ జారీ చేసిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రధానంగా చర్చించారు.
పెరుగుతున్న కాలుష్య నియంత్రణలో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి రాజధానిలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకించి ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఉల్లంఘించే వాహనాలను సరిహద్దు చెక్‌పోస్టులు మరియు ప్రత్యామ్నాయ మార్గాల వద్దే నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. అపెక్స్ కోర్ట్ మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ వాహనాల రాకపోకలపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.
అంతర్రాష్ట్ర బస్సుల అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే బస్సులను వీలైనంత వరకు వాటి ఆరిజినింగ్ పాయింట్ల వద్దే నిలిపివేయాలని సూచించారు. రవాణాదారులు మరియు బస్సు ఆపరేటర్లతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రాప్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రయాణికులు మరియు వాహనదారులకు ముందే సమాచారం అందించేందుకు సరిహద్దు ప్రాంతాలలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను, వ్యూహాత్మక ప్రాంతాలలో డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.